తెలంగాణ

telangana

Pratidwani

ETV Bharat / videos

Pratidwani : తెలంగాణలో మారుతున్న రాజకీయం - తెలంగాణ రాజకీయాలు

By

Published : Jul 4, 2023, 10:42 PM IST

Pratidwani : ఎన్నికలు సమీపిస్తున్న రాష్ట్రంలో రాజకీయం రోజురోజుకీ చిక్కబడుతోంది. ప్రధాన పార్టీల్లో పునర్‌వ్యవస్థీకరణలు, పునరేకీరణలు, వ్యూహ ప్రతివ్యూహాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా కొద్ది రోజులుగా కాంగ్రెస్‌, బీజేపీ కేంద్రంగా జరుగుకున్న పరిణామాలపైనే అందరి దృష్టి నెలకొంది. తాజాగా రాష్ట్ర బీజేపీలో హైకమాండ్ అనూహ్య మార్పులు చేపట్టింది. లేదు లేదంటూనే రాష్ట్ర అధ్యక్షుని మార్చింది. కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించింది. ఈ పరిణామం పార్టీ నేతలు, కార్యకర్తలను ఆశ్చర్యానికి గురి చేసింది. మరోవైపు కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. బీజేపీ గూటికి చేరకుండా పొంగులేటి, జూపల్లిని తమవైపు తిప్పుకుంది. మరోవైపు కమలం కోటలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా తిరిగి కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానిస్తోంది. ఇదే సమయంలో జాతీయ నాయకులతో సమావేశాలు, ఇతర రాష్ట్రాల్లో సభలతో జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ ఫుల్‌ఫోకస్‌ పెట్టారు. మరి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్​ఎస్ సన్నద్ధత ఎలా ఉంది? మారిన, మారుతున్న లెక్కల్లో చేరికల రాజకీయం ఇకపై ఎలా ఉండబోతోంది? రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఏ ఏ పార్టీల మధ్య ఉండొచ్చు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

ABOUT THE AUTHOR

...view details