PRATIDWANI: కలుషిత ఆహార ముప్పు దాటేదెలా? - హోటల్స్‌లో ఆహార నాణ్యతపై ప్రత్యేక చర్చ
నగరంలో బయటి ఆహారం ఎంత భద్రం? రాష్ట్రంలో... మరీ ముఖ్యంగా భాగ్యనగర వాసుల్ని వేధిస్తోన్న ప్రశ్న ఇది. భయపెడుతోన్న ఆహార కల్తీ, కలుషిత ఆహారఘటనలే అందుకు కారణం. కొంతకాలంగా వాటి తీవ్రత మరింత పెరిగింది. పేరు మోసిన హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, స్ట్రీట్ ఫుడ్ వరకు ఇదే ఆందోళన. వేలకొద్దీ ఉన్న ఆహార విక్రయశాలల్లో ప్రశ్నార్థకం అవుతోన్న నాణ్యతా ప్రమాణాలు రోజురోజుకు అనేక సవాళ్లను సంధిస్తున్నాయి. వాటిని అధిగమించడం ఎలా? లేక పోతే రానురాను ప్రజారోగ్య భద్రతకు ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST