TS PRATIDHWANI: ప్రతి గిరిజన గ్రామానికి బీటీ రోడ్డు హామీ నెరవేరేదెప్పుడు?
TS PRATIDHWANI: రాష్ట్రంలో సరైన రోడ్డు మార్గాలు లేక విద్య, వైద్యం వంటి కనీస సౌకర్యాల కోసం ఇబ్బందులు పడుతున్న గిరిజన గ్రామాలు వందలాదిగా ఉన్నాయి. ప్రతీ గిరిజన గ్రామానికి బీటీ రోడ్డు వేస్తామన్న ప్రభుత్వ హామీలు నెరవేరే దారి కనిపించడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన వేల కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ లక్ష్యాలు ప్రతిపాదనలకే పరిమితం అవుతున్నాయి. ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపం, అరకొర నిధుల కేటాయింపులతో అటవీ గ్రామాలకు రోడ్ల నిర్మాణం తీరని కలగానే మిగిలిపోతోంది. ఈ పరిస్థితిలో మార్పు ఎప్పటికి సాధ్యం? ఇదే అంశంపై ఈ రోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST