TS PRATHIDHWANI: కౌలు రైతులు, పట్టాల్లేని సాగుదారులకు పంట పెట్టుబడి అందేదెలా? - ఈటీవీ భారత్ ప్రతిధ్వని
TS PRATHIDHWANI: వానాకాలం ప్రారంభం కావడంతో రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. నేల చదును చేసుకుని, దక్కులు దున్నుతున్నారు. మరో జల్లు పడగానే విత్తనాలు నాటుకుని, ఎరువులు చల్లేందుకు ఏర్పాటు చేస్తున్నారు. వీటన్నింటికీ అవసరమైన వ్యవసాయ పెట్టుబడుల కోసం రైతులు అందినకాడల్లా అప్పులు, చేబదుళ్ల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతుకు పెట్టుబడి సాయం అందించే మార్గాలు ఏమున్నాయి? ప్రభుత్వం నుంచి రావాల్సిన ధాన్యం బకాయీలు ఎప్పుడొస్తాయి? ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన రైతు బంధు సహాయం సాగు పెట్టుబడికి సరిపోతుందా? ఇదే అంశంపై ఈ రోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST