భగభగమంటున్న భానుడు.. బయటికి వెళ్లాలంటే భయపడేలా.. - హైదరాబాద్ తాజా వార్తలు
Summer Effect in Hyderabad: రాష్ట్రంలో ఇప్పటికీ భానుడు రోజురోజుకు మండిపడుతున్నాడు. నిప్పులు కక్కుతూ.. జనాలను ఉక్కిరిబిక్కిరికి గురిచేస్తున్నాడు. మధ్యాహ్నం పూట అయితే మాడు పగిలేలా ఎండలు దండి కొడుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు చేస్తూ.. భానుడు బయటికి వెళ్లాలంటేనే భయపడేలా ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. అయితే.. రాష్ట్రంలో రాగల నాలుగైదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈరోజు ఉష్ణోగ్రతలు చూసినట్లైతే క్రమేనా పెరిగి ప్రస్తుతానికి ఉత్తర తెలంగాణ జిల్లాలైనా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల ప్రాంతాల్లో 40 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారిణి శ్రావణి తెలిపారు.
"అలాగే ఏప్రిల్ 3,4 తారీఖుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలైనా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల ప్రాంతాల్లో.. దీంతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలైనా జోగులాంబ గద్వాల్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాల్లో కూడా 40 కంటే ఎక్కవగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు చేయడం జరిగింది. మార్చ్ 21వ తారీఖు నుంచి కొంచం ఉష్ణోగ్రతలు పెరుగుతూ.. ఏప్రిల్ నెలలో 40 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. ఒకోక్కసారి వడగాలులు వీచే అవకాశం ఉందని, అంటే 45 డిగ్రీలు కూడా చేరే అవకాశం ఉంది. ఈ ఏడాదికి చూస్తే.. ఏప్రిల్, మే నెలలో ఒకటి, రెండు సార్లు ఈ గాలులు తగిలే అవకాశం ఉంది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వృద్ధులు, పిల్లలు బయటకు రావద్ధని, అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి" అని తెలిపారు. -శ్రావణి, హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారిణి