వేగవంతమైన సేవలే లక్ష్యం భవిష్యత్తులో మరిన్ని సరకు రవాణా విమానాలు - Amazon
Amazon Aircraft for Cargo Transportation అమెజాన్ కస్టమర్లకు వేగవంతమైన సేవలందించే లక్ష్యంతో సరకు రవాణా కోసం ప్రత్యేకంగా విమానం ఏర్పాటు చేసినట్లు అమెజాన్ ఇండియా వెల్లడించింది. దేశంలో మొట్టమొదటి సరకు రవాణా ఎయిర్ క్రాప్ట్ హైదరాబాద్ నగరం నుంచే ప్రారంభించినట్లు వివరించింది. వినియోగదారుల డిమాండ్‌ను బట్టి సరకుల రవాణా విమానాల సంఖ్యను భవిష్యత్‌లో పెంచనున్నట్లు సంస్థ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 110 ఎయిర్ క్రాప్ట్‌లున్న అమెజాన్‌కు పండుగల సమయంలో డిమాండ్ అధికంగా ఉంటోందని తెలిపింది. ఈ నేపథ్యంలో అమెజాన్ ఇండియా డైరెక్టర్ అభినవ్ సింగ్‌తో మా ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖి.