ప్రచారానికి తెర ఓటరు ప్రలోబానికి ఎర అతి పెద్ద సవాల్‌గా ఆఖరి క్షణాలు - etv bharat prathidwani
PRATHIDWANI అధికార ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా చావోరేవో అన్నట్లు పోరాడిన మునుగోడు ఉపఎన్నికల ప్రచారానికి తెర పడింది. దాదాపు నెల రోజులుగా హోరెత్తిన మైకులన్నీ సాయంత్రం 6 గంటల తర్వాత బంద్ అయ్యాయి. అయితే ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇక నుంచి మరో ఎత్తు అన్నట్లు పార్టీలు తెరవెనక అసలైన ఎలక్షనీరింగ్ మొదలు పెట్టే సమయం ఇదే. ఆఖరి క్షణాల్లోనూ ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు ప్రలోభాల పర్వాన్ని తీవ్రం చేసే అవకాశాలూ ఆ తరహా అనుభవాలూ ఎన్నో. ఆ నేపథ్యంలోనే వాటిని అడ్డుకొని నిష్పక్షపాతంగా పోలింగ్ నిర్వహించడం ఇప్పుడు ఎన్నికల అధికారుల ముందున్న అతిపెద్ద సవాల్. మరి ఓట్ల కొనుగోలు సాధారణంగా మారుతోందని భావిస్తున్న వేళ ఈ ప్రలోభాలకు అడ్డుకట్ట వేయడం ఎలా. ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటే పారదర్శక పోలింగ్‌కు అవకాశం ఉంటుందనే అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చ.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST