PRATHIDWANI తెలంగాణలో పంచాయతీ నిధులపై సమస్య ఏంటీ - సర్పంచ్ విధులు
PRATHIDWANI: పంచాయతీల నిధులు. కొద్దిరోజులుగా రాష్ట్రంలో నడుస్తున్నకొత్త పంచాయితీ ఇది. రాష్ట్రంలో వారి నిధులను ప్రభుత్వం దారి మళ్లించిందన్న పంచాయతీరాజ్ ఛాంబర్ ఆరోపణలు, విపక్షాల ఆందోళనలతో అందరి దృష్టి కూడా ఈ విషయంపై పడింది. మరి... క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమిటి? రాష్ట్రంలోని పంచాయతీలు అసలు నిధులు పరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల నిధులు దారి మళ్లిస్తోందన్న వివాదం ఎందుకు వచ్చింది? వివాదంపై సర్పంచులు ఏమంటున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST