PRATHIDWANI: కలవర పెడుతున్న ఆన్‌లైన్ జూదం.. చేపట్టాల్సిన దిద్దుబాటు చర్యలు ఏమిటి?
PRATHIDWANI: కాయ్ రాజా.. కాయ్.. వంద పెట్టండి వెయ్యి గెలుచుకోండి. కొద్దిరోజులుగా అమాయకులపై వల విసురుతున్న బెట్టి ముఠాల మాయ ఇది. ఒకప్పుడు ఎక్కడా సందుగొందుల్లో గుట్టుగా సాగిపోయేది ఈ వ్యవహారం. కానీ ఇప్పుడలా కాదు.. పలు యూట్యూబ్ ఛానళ్లు, వెబ్‌సైట్ల ద్వారానే కాకుండా.. నగరంలోని బహిరంగ ప్రాంతాల్లోనూ ప్రకటనలు గుప్పిస్తున్నాయి బెట్టింగ్ ముఠాలు. మొబైల్ యాప్‌ల రూపంలోనూ అమాయకుల జేబులు కొడుతున్నాయి. ఆన్‌లైన్‌లో తారస పడుతున్న ప్రకటనలు క్షణాల వ్యవధిలో ఖాతాలు ఖాళీ చేస్తున్నాయి. రోజురోజుకీ పెరుగుతున్న ఈ తరహా మోసాలు కలవర పెడుతున్నాయి. రాష్ట్రంలో ఆన్‌లైన్ జూదంపై నిషేధం ఉన్నప్పటికీ.. సమస్య ఈ స్థాయిలో పెరగడానికి కారణమేంటి? బెట్టింగ్ బాబులు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు? యువత ఆ వారి బారిన పడకుండా ఏం చేయాలి? ఆన్‌లైన్ లింకుల్లో చిక్కి నష్టపోతున్న వారికి దిక్కెవరు?..రాత్రికి రాత్రే జీవితాల్ని రోడ్లపైకి తెచ్చేస్తున్న ఘటనలపై.. తక్షణం చేపట్టాల్సిన దిద్దుబాటు చర్యలు ఏమిటి? ఎలాంటి అప్రమత్తత అవసరం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.