తెలంగాణ

telangana

ETV Bharat / videos

PRATHIDWANI సరోగసీ ప్రక్రియపై ఎలాంటి నియంత్రణ అవసరం - అద్దెగర్భం ఆగని అడ్డదారులు

By

Published : Nov 5, 2022, 10:01 PM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

PRATHIDWANI పేదల ఆర్ధికఅవసరాలే ఆసరాగా చేసుకుంటున్న అద్దెగర్భాల ముఠాల కార్యకలాపాలు మరోసారి భాగ్యనగరంలో కలకలం రేపాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో కఠిన నియంత్రణ చట్టం తీసుకుని వచ్చినా నగరంలో అక్రమ పద్ధతుల్లో సరోగసీ ప్రక్రియ గుట్టుగా సాగిపోతోంది. హబ్సీగూడలోని ఒక ఆస్పత్రిలో అద్దెగర్భం ద్వారా శిశువును కనడానికి ఒప్పందం చేసుకున్న మహిళ అనారోగ్యం పాలవడంతో మొత్తం విషయంలో వెలుగులోకి వచ్చింది. సరోగసీ ప్రక్రియ విఫలమైన ఆమె అస్వస్థతకు గురికావడం, దళారీ పట్టించుకోక పోవడంతో అసలు దందా బయట పడింది. అనేక చిక్కుముళ్లు ఇమిడి ఉండే ఈ విషయంలో ప్రభుత్వం, అధికారులు నిశితంగా పర్యవేక్షణ చేస్తున్నామని చెబుతున్నా ఇలాంటి పరిణామాలు దేనికి సంకేతం సరోగసీ ప్రక్రియపై ఇకనైనా ఎలాంటి నియంత్రణ అవసరం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

...view details