Prathidwani : రోజురోజుకీ ఖరీదుగా మారుతున్న తెలంగాణ రాజకీయాలు
Prathidwani Debate on Telangana politics : రాష్ట్రంలో రోజురోజుకీ రాజకీయాలు ఖరీదుగా మారుతున్నాయి. ఇది ఎంతో కాలం నుంచి ఉన్నమాటే కావొచ్చు. కానీ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమీపిస్తున్న తరుణంలో.. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ముందు జాగ్రత్తగా చర్యలు, వెల్లడిస్తున్న వివరాలే ఆశ్చర్యం కలిగి స్తున్నాయి. రాష్ట్రంలో గత ఎన్నికల్లో పట్టుకున్న డబ్బు, 4 ఎన్నికల వ్యయాలు దేశంలోనే కొత్త రికార్డు స్థాయిలను సూచిస్తున్నాయట. ప్రజాస్వామ్యబద్దంగా జరిగే ఎన్నికల ఈ నోట్ల ప్రవాహాన్ని నిలువరించేదుకే ఈసారి ఏకంగా 20కి పైగా ఏజెన్సీలను ఈసీ రంగంలోకి దించనుంది. మరి రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించబోతున్న రాబోయే ఎన్నికల్లో డబ్బు, మద్యం, ప్రలోభాల పర్వానికి అడ్డుకట్ట వేయడం ఎలా? సమర్ధవంతంగా ఎన్నికలు నిర్వహించడం ఎలా? ప్రశాంతంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉందా? వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఎక్కువ మొత్తంలో డబ్బుల దొరికే అవకాశం ఉందా? వీటిని నివారించే మార్గం ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.