Prathidwani : రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆవేదన మిగిల్చిన వరదలు - గోదావరి వరదలు
Prathidwani on Telangana Floods 2023 : వాతావరణం అంతుచిక్కనిది. అది ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ ఊహించనిది. భూతాపం అనూహ్యంగా పెరిగిపోయిన ప్రస్తుత కాలంలో వాతావరణ మార్పులు ఇంకా వేగంగా సంభవిస్తున్నాయి. విపరీతమైన ఎండలు, కరువులు, తుపాన్లు, అకాల వర్షాలు ఈ కోవలోనివే. తాజాగా ఇటీవల పదిరోజులు రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో గోదావరికి పోటెత్తిన వరదలు తెలంగాణ ప్రజలకు తీవ్ర ఆవేదన మిగిల్చాయి. ప్రభుత్వ నివేదిక ప్రకారం 41మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. వరదల్లో కొట్టుకుపోయిన వారి ఆచూకీపై రాష్ట్ర హైకోర్టు ఆరా తీసింది. ఆ కుటుంబాలు ఎలాంటి చేయూతనిచ్చారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. గోదావరి, కృష్ణా వెంట వరదలు అనేవి కొత్త కావు.. అయినా ప్రతిసారి అపారనష్టం ఎందుకు వాటిల్లుతోంది? ప్రాణ నష్టం ఎందుకు నివారించలేక పోతున్నాము? తరచు ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలకు ఎలాంటి చర్యలుంటే మేలు? అనే అంశాలపై నేటి ప్రతిధ్వని.