Prathidwani : చంద్రయాన్-3 ద్వారా ఇస్రో ఆశిస్తున్న లక్ష్యాలేమిటి? - ap latest news
Prathidwani on ISRO Chandrayan-3 Mission : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ – ఇస్రో.. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగానికి.. సమయం దగ్గర అవుతోంది. ఎంతోకాలంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఆ క్షణానికి.. ఈ నెల 14వ తేదీ.. మధ్యాహ్నం 2 గంటల 35 నిషాలకు ముహూర్తం ఖరారు అయింది. అందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చకచకా జరిగి పోతున్నాయి. చంద్రయాన్-3తో చంద్రుడిపై రోవర్‌ను దించేందుకు భారత్ చేస్తున్న మూడో ప్రయత్నం ఇది. మిషన్‌లో భాగంగా ఎల్‌వీఎం-3పీ4 రాకెట్‌తో చంద్రయాన్-3 అంతరిక్ష నౌకను అనుసంధానించే ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు జులై 5న పూర్తిచేశారు. మరి చంద్రయాన్-3 ద్వారా.. ఇప్పటి వరకు ఎవరూ చేరుకోని.. చంద్రుని దక్షిణధ్రువ అన్వేషణనే ఇస్రో ఎందుకు ఎంచుకుంది? సవాళ్లకు ఎదురు నిలిచి మరీ ఇంతగా ఎందుకు ఆ లక్ష్యం కోసం పరిశ్రమిస్తోంది? ఈ మిషన్ లక్ష్యాలు, ప్రయోజనాలు ఏమిటి? చంద్రయాన్-3 విజయవంతమైతే ఇస్రో ఎలాంటి కొత్త చరిత్ర లిఖించబోతోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.