PRATHIDWANI నిప్పుతో చెలగాటం దిద్దుబాటు చర్యలు ఎలా - Secunderabad fire accident latest news
అగ్ని ప్రమాదాలు.. ఆరని మంటలు. సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులో బుగ్గిగా మారిన బహుళ అంతస్తుల భవనం దక్కన్ స్పోర్ట్స్ నిట్‌వేర్ ఘటన తర్వాత అందరిలో మెదులుతున్న అంశం ఇది. అత‌్యంత రద్దీ ప్రాంతంలో, జనావాసాలను ఆనుకుని ఉన్న భారీ భవంతిలో జరిగిన ఈ ప్రమాదం ప్రతిఒక్కర్నీ ఉలిక్కిపడేలా చేసింది. అగ్నిమాపక సిబ్బంది ఏడెనిమిది గంటల పాటు శ్రమిస్తే గానీ ఆ అగ్నికీలలు అదుపులోకి రాలేదు. ప్రమాదానికి తక్షణ కారణం ఏదైనా గానీ.. అన్ని వేళ్లూ చూపిస్తున్నది మాత్రం.. భద్రతా నిబంధనలకు పాతర, అంతులేని నిర్లక్ష్యం వైపే. ఎంతోమంది ప్రజల ప్రాణాలు, కోట్లాది రూపాయల విలువైన ఆస్తులతో ముడిపడిన విషయంలో.. ఇలా నిప్పుతో చెలగాటం ఎందుకు. దీనికి ఎవరు బాధ్యులు.. దిద్దుబాటు ఎలా.. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.