తెలంగాణ

telangana

Prathidwani

ETV Bharat / videos

Prathidwani : అన్నదాతపై ప్రకృతి కన్నెర్ర.. రైతు కన్నీళ్లు తుడిచే మార్గమేది ?

By

Published : Aug 4, 2023, 6:39 AM IST

Prathidwani on Crops Damage : అందరికీ అన్నం పెట్టే అన్నదాతపై ప్రకృతి కన్నెర్ర చేస్తుంటే.. ఆదుకోవాల్సిన బాధ్యత ఎవరిది? దేశంలో ఈ రోజుకీ కోట్లాదిమందికి జీవనాధారం.., ఆకలితీర్చే అన్నపూర్ణగా ఉన్న సాగురంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించడం ఎలా? లక్షల ఎకరాల్లో పంటనష్టాలకు కారణమవుతున్న వరదలు, విపత్తుల నేపథ్యంలో వేధిస్తోన్న ప్రశ్నలివి. సవాళ్లకు ఎదురీదుతూ.. ఆరుగాలం కష్టపడినా.. తమ తప్పు లేకుండానే ప్రకృతి ధాటికి నష్టపోతున్నారు రైతన్నలు.  పంటనష్టం సమయంలో వేగంగా సాయం అందాలి. పంటనష్టం అంచనాల్లో సాంకేతికత పాత్ర పెరగాలి డేటా ఆధారంగా ఆటోమేటిక్‌గా పరిహారాలు ఇవ్వాలి. రైతుకు ఆదాయభద్రత కల్పించడమే ప్రధాన సవాల్​గా మారింది. మరి... ప్రకృతి విపత్తుల వల్ల కలిగే నష్టాలు భర్తీ చేయటానికి ప్రస్తుతం ఉన్న మార్గాలేంటి పంటల బీమా వంటివి నిజంగా నూరుశాతం అమలు అవుతున్నాయా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేసే పంటనష్టం అంచనాలు... ఎలా ఉంటున్నాయి? ఈ విషయంలో ఇకనైనా ఎలాంటి సంస్కరణలు అవసరం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

ABOUT THE AUTHOR

...view details