కలవరపెడుతోన్న గుండె జబ్బులను ముందుగానే గుర్తించడం ఎలా
PRATHIDWANI గుండె జబ్బుల్ని గుర్తించడం ఎలా? ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇది. కొంతకాలంగా పెరుగుతున్న గుండె జబ్బులు, కార్డియాక్ అరెస్టులే అందుకు కారణం? అప్పటి వరకు నవ్వుతూ, ఉత్సాహంగా మన మధ్య ఉన్నవారే ఉన్నట్లుండి కుప్పకూలి పోతున్నారు. ఏవో అలవాట్లు ఉన్నవారంటే సరే.. కానీ ఏ అలవాట్లు లేని వాళ్లకు కూడా గుండె జబ్బులు ఎందుకు వస్తాయి? అసలు ఈ ఆపదలపై గుండె ఏవైనా సంకేతాలు పంపుతుందా? వాటిని గుర్తించి జాగ్రత్త పడటానికి ఏం చేయాలి? 40 ఏళ్ల వయసుకే గుండె జబ్బులు రావటం ఏమిటి? అసలు ఫిట్‌గా కనిపించే వారిలోనూ గుండెజబ్బులు ఎందుకు వస్తున్నాయి? ఆరోగ్య పరీక్షలు ఎంత కాలానికి ఒకసారి చేయించుకోవాలి? మన గుండెను పదిలంగా కాపాడుకోవడం ఎలా? గుండె ఆరోగ్యానికి ఆహార అలవాట్లు, జీవనశైలి ఎలా ఉండాలి? గుండె సమస్య ఉంటే తప్పక పాటించాల్సిన జాగ్రత్తలేంటి అనే అంశాలపై నేటి ప్రతిధ్వని.