TS PRATHIDHWANI: సాదాబైనామాల పరిష్కారం ఎందుకు జఠిలంగా మారింది? - సాదాబైనామా దరఖాస్తులు
TS PRATHIDHWANI: రాష్ట్రంలో సాదాబైనామా దరఖాస్తుల క్రమబద్ధీకరణ కోసం రైతులు కళ్లు కాయలుకాసేలా ఎదురు చూస్తున్నారు. వీటి రిజిస్ట్రేషన్లకు కచ్చితమైన మార్గదర్శకాలు లేనందువల్లే పరిష్కారం జఠిలంగా మారిందన్న వాదన ఉంది. ఇప్పటికే ఆరు లక్షలకు పైగా దరఖాస్తులను క్రమబద్ధీకరించినట్లు చెబుతున్నా... ఇంకా ఎనిమిది లక్షలకు పైగా పరిష్కారం కోసం నిరీక్షిస్తున్నాయి. కలెక్టర్ల లాగిన్ లోఉన్న వాటిలో రెండు లక్షల వరకు తిరస్కరణకు గురైనట్లు జరుగుతున్న ప్రచారం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. అసలు ఆసాదాబైనామాల క్రమబద్దీకరణ సుదీర్ఘ కాలం నుంచి ఎందుకు అపరిష్కృతంగా ఉంది? కలెక్టర్ల ఆమోదం పొందినవెన్ని? భూ యాజమానులను నిర్దారించడంలో రెవెన్యూ అధికారులు పూర్తి చేయాల్సిన ప్రక్రియలేంటి ? ఇదే అంశంపై ఈ రోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST