PRATHIDHWANI ర్యాగింగ్ నియంత్రణకు ఉన్న చట్టాలు నిబంధనలేంటి - ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చ
కళాశాలలో ర్యాగింగ్ భూతం కలకలం సృష్ఠిస్తోంది. కోటి ఆశలతో చదువుల తల్లి వద్దకు చేరుతోన్న విద్యార్ధులు ర్యాగింగ్ రక్కసికి బలవుతున్నారు. ఇన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న ఈ వికృతక్రీడ రాష్ట్రంలో మళ్ళీ జడలు విప్పుతోంది. ర్యాగింగ్ నియంత్రణకుఉన్న చట్టాలు, నిబంధనలు అమలుతీరును వరుస ఘటనలు ప్రశ్నిస్తున్నాయి. కళాశాలల్లో సహృద్భావ వాతావరణం ఎందుకు ఉండట్లేదు. జరుగుతోన్న ఘటనలు ఎవరి వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. ఒక్క బాధిత విద్యార్దులే కాదు ప్రతీ విద్యార్ధి తల్లిదండ్రుల మదిలో మెదులుతోన్న ర్యాగింగ్ భయాలకు అడ్డుకట్ట వేసేది ఎలా. ఇదే అంశంపై నేటి మన ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST