Prathidhwani: ఈసారి నిర్మలమ్మ బడ్జెట్ వంట ఎలా ఉండబోతోంది - Central budget 2023
కొత్త బడ్జెట్‌పై కోటి ఆశలు... దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న సమయం రానే... వస్తోంది. మాంద్యం భయాలు, వడ్డీరేట్ల వాతలు, ద్రవ్యోల్బణం మంటలు, ఆర్థికంగా నెలకొన్న ఆందోళనల మధ్య కేంద్ర బడ్జెట్ ఎలా ఉండబోతోంది? పైగా రానున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టనున్న పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో ఆ అంచనాలు మరింత భారీగానే ఉన్నాయి. ఆర్థికసర్వే చెబుతున్నట్లు మిగిలిన దేశాలతో పోల్చితే... కరోనా ప్రభావం నుంచి భారత్ వేగంగానే కోలుకున్నా... ప్రస్తుతం సగటు భారతీయుడు పరిస్థితి ఏమిటన్నది అందర్నీ వేధిస్తున్న ప్రశ్న. మరి ఈసారి నిర్మలమ్మ బడ్జెట్ వంట ఎలా ఉండబోతోంది .. ఏ ఏ రంగాలు ఏం ఆశిస్తున్నాయి? పన్నుభారాలపై వేతన, మధ్యతరగతి జీవులకు ఊరట లభించే అవకాశాలు ఎంత? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.