తెలంగాణ

telangana

Ponguleti

ETV Bharat / videos

ponguleti srinivas reddy : 'ఆ పార్టీలో చేరి.. కేసీఆర్ మరోసారి గెలవకుండా అడ్డుకుంటా' - సీఎం కేసీఆర్​పై పొంగులేటి ఫైర్

By

Published : Apr 20, 2023, 9:37 AM IST

ponguleti srinivas reddy Interview: భారత్ రాష్ట్ర సమితిని మూడోసారి అధికారంలోకి రాకుండా... కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కాకుండా నిలువరించే పార్టీలోనే చేరుతానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెలాఖరులోపు తన రాజకీయ పయనంపై స్పష్టత వస్తుందని వెల్లడించారు. ఈ నెలాఖరులో ఖమ్మంలో నిర్వహించే ఆత్మీయ సమ్మేళనంతో... బీఆర్​ఎస్​పై యుద్ధం ప్రకటిస్తానన్న పొంగులేటి... ఎట్టిపరిస్థితుల్లోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్​ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేటు తాకనీయబోనని మరోసారి పునరుద్ఘాటించారు. 

ఆరేళ్లుగా పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం కల్పించలేదని పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి వాపోయారు. పార్టీలో చేర్చుకున్నప్పుడు ఎన్నో మాటలు చెప్పారన్న పొంగులేటి.. అనుచరులకు పదవుల్లేక, ఎంపీ సీటు రాక అవస్థలు పడ్డామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తండ్రితో సమానంగా భావించానని... కానీ నమ్మించి నట్టేట ముంచారని ఆరోపించారు. బీఆర్​ఎస్ నుంచి విముక్తి లభించిన తర్వాత... రావణాసురుడి కబంధ హస్తాల నుంచి బయటపడ్టట్టు ఉందని అన్నారు. అధికారం, ప్రభుత్వం చేతుల్లో ఉందని పొంగులేటిని భయపెట్టలేరన్న ఆయన... తన ఆర్థిక నేరాలు, భూదందాలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని 'ఈటీవీ-భారత్​'  ప్రత్యేక ముఖాముఖిలో వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details