తెలంగాణ

telangana

Mountaineer Vivek Kumar Interview

ETV Bharat / videos

Mountaineer Vivek Kumar Interview : మారుమూల గిరిజన గ్రామంలో పుట్టాడు.. కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు.. - tribal man Vivek Kumar climbed Mount Kilimanjaro

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2023, 3:54 PM IST

Telangana Youngman Vivek Kumar Climbing Mountains : సాఫ్ట్​వేర్​ కొలువు సాధించిన.. తాను పెరిగిన పరిస్థితులు తనను పర్వతారోహణ వైపు నడిపించాయి. ఏడు ఖండాల్లోని ఎత్తైన పర్వతాలను అధిరోహించాలనే లక్ష్యంతో.. అటుగా అడుగులు వేశాడు. చివరికి తాను అనుకున్నది నెరవేర్చుకుంటూ.. విజయపథంలో నడుస్తున్నాడు. ఆ యువకుడు ఎవరో కాదు.. తెలంగాణ బిడ్డ వివేక్​ కుమార్​. గిరిజన ప్రాంతంలో పుట్టిన ఆ యువకుడు గతంలో మౌంట్​ ఎల్బ్రస్​ శిఖరాగ్రాన్ని చేరుకున్నాడు.

అలాగే ఇటీవల ఎంతో మంది పర్వతారోహకులకు ఇష్టమైన కిలిమంజారో శిఖరాగ్రాన్ని సైతం అధిరోహించి.. పలువురి ప్రశంసలు అందుకున్నాడు. మరి త్వరలో దాతల సహకారంతో ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కేస్తానని వివేక్​ కుమార్​ ధీమా వ్యక్తం చేస్తున్నారు. చిన్ననాటి నుంచే పర్వతారోహణపై ఆసక్తి.. అందుకు తగిన కఠిన శిక్షణ, అప్రమత్తత ఎంతో అవసరమని తెలుపుతున్నారు. మొక్కవోని ధైర్యమే తనను ఆ పర్వతారోహణ చేసేందుకు ఇంధనమని తెలిపారు. అసలు పర్వతారోహణ అంటే ఆసక్తి ఎలా కలిగింది...? మౌంటెనీరింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి లాంటి విషయాలను అతన్నే అడిగి తెలుసుకుందాం.

ABOUT THE AUTHOR

...view details