Bhatti vikramarka: 'కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు' - Mancheryala District News
Bhatti vikramarka interview: ఆదిలాబాద్ జిల్లాలో పీపుల్స్ వార్ పేరుతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రారంభించిన పాదయాత్ర నేటితో ముగియనుంది. ఈ పాదయాత్ర 31 రోజుల పాటు సాగింది. ఇంతటితో కాకుండా తన పాదయాత్ర ఆదిలాబాద్ జిల్లా నుంచి ఖమ్మం వరకు కొనసాగుతుందని, పాదయాత్ర ముగిసే వరకు నాలుగు బహిరంగ సభలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గూడాలు, తాండాలు, గిరిజన ప్రాంతాలలో కొనసాగిందని, ఎన్నో వేల ప్రజా సమస్యలు ఎదురయ్యాయన్నారు.
ఈ క్రమంలోనే అంకిత భావంతో కాంగ్రెస్ జెండాలు మోసే శ్రేణులను.. పార్టీ కాపాడుకుంటుందని, అలాంటి వారిని దూరం చేసుకోదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు అనేది నిర్దిష్టమైన ప్రణాళికాబద్ధంగానే సాగుతుందని.. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన స్వతంత్ర సంస్థలతో సర్వే కొనసాగుతుందని వెల్లడించారు. కార్పొరేట్ల ప్రతినిధిగా ఉన్న బీజేపీని.. ఫ్యూడలిస్టుల ప్రతినిధిగా ఉన్న బీఆర్ఎస్ను ఓడించి.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్న భట్టి విక్రమార్కతో.. ప్రత్యేక ముఖాముఖి..