తెలంగాణ

telangana

Etv Bharat interview

ETV Bharat / videos

Adluri Laxman Interview: 'ధర్మపురి ఓట్ల రీకౌంటింగ్ జరగాల్సిందే' - జిగిత్యాల జిల్లా తాజా వార్తలు

By

Published : Apr 17, 2023, 4:58 PM IST

Congress Candidate Adluri Laxman Kumar Interview: జగిత్యాల జిల్లా ధర్మపురి ఓట్ల రీకౌంటింగ్ జరిపే వరకు తన పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. హైకోర్టు ఆదేశం మేరకు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న అధికారుల విచారణ జగిత్యాల జిల్లా నాచుపల్లి జేఎన్టీయూలో కొనసాగుతోందని పేర్కొన్నారు. గత నాలుగున్నర ఏళ్లుగా ఎన్నికల ప్రక్రియ సందర్భంగా జరిగిన అక్రమాలపై పోరాడుతున్నట్లు చెప్పారు. తాము కౌంటింగ్ అయిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా న్యాయ పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. హైకోర్టు ఎన్నికలకు సంబంధించిన డాక్యుమెంట్లు, వీడియోలు తీసుకు రావాలని ఆదేశించినట్లు చెప్పారు. 

13వ రౌండ్ వరకు తనకు 3 వేల మెజారిటీ ఉండగా.. అకస్మాత్తుగా 414 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపొందినట్లు ప్రకటించినప్పుడే అభ్యంతరం చెప్పినట్లు పేర్కొన్నారు. కౌంటింగ్​లో అవకతవకలు జరిగినట్లుగా తెలుస్తోందని ఆరోపించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా నమోదు చేసిన వివరాలతో పాటు సీసీ ఫుటేజీ ఇవ్వడానికి స్ట్రాంగ్ రూమ్ తాళం చెవిలు లేవంటున్నారంటే అక్రమాలు జరిగినట్లే అంటున్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్​తో మా ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖి..

ABOUT THE AUTHOR

...view details