నిరుద్యోగ యువత, ఉద్యోగుల సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా : ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ - mlc elcetions 2023
Vepada Chiranjeevi: విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, తెలుగుదేశం శ్రేణులు అంతా కలిసి తన గెలుపునకు కృషి చేశారని ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు అన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు విద్యార్థులకు, తల్లిదండ్రులకు, టీడీపీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. నిరుద్యోగ యువత, ఉద్యోగుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. శాసనమండలిలో నిరుద్యోగంపై పోరాటం చేస్తానని అన్నారు. జాబ్ క్యాలెండర్, యువతకు నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు దిశగా దృష్టి సారిస్తమన్నారు.
రాష్ట్రంలో నిర్వహించిన శాసనమండలి ఎన్నికలలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి టీడీపీ తరఫున వేపాడ చిరంజీవిరావు పోటీ చేశారు. వైసీపీ నుంచి సీతంరాజు సుధాకర్ పోటీ చేశారు. మొదటి ప్రాదాన్యత ఓట్లు లెక్కింపు పూర్తయ్యేసరికి 82 వేల958 ఓట్లు టీడీపీ అభ్యర్థి చిరంజీవీ రావుకు రాగా.. వైసీపీ అభ్యర్థికి 55వేల 749 ఓట్లు వచ్చాయి. విజయానికి 94 వేల 509 ఓట్ల అవసరం కాగా రెండో ప్రాదాన్యత ఓట్లను లెక్కించారు. ఇందులో టీడీపీ అభ్యర్థికి విజయానికి కావల్సిన ఓట్లు నమోదు కావటంతో విజయం సాధించారు. విజయాన్ని కైవసం చేసుకున్న చిరంజీవీ రావు.. సమస్యలపై పోరాటమే లక్ష్యంగా పనిచేస్తానని అంటున్నారు. ఆయనతో ఈటీవీ భారత్ ముఖాముఖి..