TS PRATHIDHWANI: యూనివర్సిటీల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులేంటి?
TS PRATHIDHWANI: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు ఆందోళన బాట పడుతున్నారు. మొత్తం 11 విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలలు, వాటి హాస్టళ్లు, లైబ్రరీ భవనాల తోపాటు బోధన, బోధనేతర అంశాలన్నీ సమస్యల ఉచ్చులో చిక్కుకున్నాయి. అకడమిక్ పరిశోధనలకు అవసరమైన గైడ్లు, మౌలిక సదుపాయాల మాట అటుంచితే... వసతి, పారిశుద్ధ్యం, భోజనం, గ్రంథాలయాల నిర్వహణకు కూడా విద్యార్థులు అల్లాడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే బాసర ఆర్జీయూకేటీలో నిరసనలు కొనసాగుతుండగానే... తెలంగాణ, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. అసలు రాష్ట్రంలో యూనివర్సిటీల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి? ఇదే అంశంపై ఈరోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST