Pratidwani: రాష్ట్రంలో వేడెక్కిన చేరికల రాజకీయం.. పార్టీల వ్యూహాలు ఏమిటి? - తెలంగాణ రాజకీయాలపై ఈటీవీ భారత్ డిబేట్
Pratidwani: రాష్ట్రంలో చేరికల రాజకీయం వేడెక్కుతోంది. రాష్ట్ర శాసనసభకు కొద్ది నెలల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చేరికలపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. అందుకు తగినట్లే క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఊహించని రీతిలో తెరపైకి వస్తున్న రాజీనామాలు, సస్పెన్షన్లు రాజకీయ ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వ్యూహ, ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. అయితే పార్టీలు చేపడుతున్న వ్యూహాలు ఏమిటి? అవి క్షేత్రస్థాయి రాజకీయాల్ని ఎలా ప్రభావితం చేసే అవకాశం ఉంది.
ప్రధాన పార్టీలు అయిన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లోకి.. వలసలు ఇంకా కొనసాగే అవకాశం ఉందా ? ఇప్పటికే పలువురు నాయకులు పలు పార్టీలతో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే చేరికల రాజకీయంలో ఎవరు ఎక్కడ ? వచ్చే నెలలో జరిగే కర్నాటక ఎన్నికల ఫలితాల ప్రభావం.. తెలంగాణ రాజకీయాలపై ఏ మేరకు పడే అవకాశం ఉంది? ఇకపై ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు ? రాష్ట్ర భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండొచ్చు? అనే అంశంపై నేటి ప్రతిధ్వని.