యావత్ దేశం చూపు మునుగోడు వైపు ముక్కోణపు పోరులో గెలిచేది ఎవరు - munugode latest news
PRATHIDWANI ప్రస్తుతం ఒక్క తెలంగాణలోనే కాదు యావత్ దేశం చూపు మునుగోడు వైపు నెలకొన్నదంటే అతిశయోక్తి కాదు. షెడ్యూల్ ప్రకటనకు ముందే మొదలైన రాజకీయ వేడి క్రమక్రమంగా పెరిగి ఇప్పుడు కడక్ కడక్‌గా మారింది. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకునేందుకు చావోరేవో అంటున్న కాంగ్రెస్, రానున్న ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా ఢీ అంటే ఢీ అంటున్న రాష్ట్రంలోని అధికార తెరాస, కేంద్రంలోని అధికార భాజపా ఈ ఉత్కంఠను అంతకంతకూ మరింత పెంచుతున్నాయి. మరి ఈ త్రిముఖ పోరులో గెలిచేది ఎవరు. ప్రలోభాల జాతర ఏ స్థాయిలో నడుస్తున్నా క్షేత్రస్థాయిలో ఓటరు నాడి పార్టీలకు అంతుబడుతోందా. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST