Prathidwani: ఆరుగాలం శ్రమ వర్షార్పణం.. నష్టం భర్తీపై ఎలాంటి విధానం ఉంటే మేలు? - ఫసల్ బీమా
Crop loss in Telangana: ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన పంటలకు కనీస రక్షణ కరవవుతోంది. మార్కెట్ యార్డుల్లో అరకొర వసతులు అన్నదాతల పాలిట శాపంగా మారుతున్నాయి. రాష్ట్రంలో 230 మార్కెట్ యార్డులున్నాయి. వాటిల్లో ఎన్నిచోట్ల యార్డుల్లో పంట ఉత్పత్తుల రక్షణకు సరైన సదుపాయాలు ఉన్నాయి ? ఈ ప్రశ్నకు సమాధానం అన్వేషిస్తే చాలు సమస్య తీవ్రత ఏమిటో అందరికీ ఇట్టే అర్థం అవుతుంది. ఫలితం.. ఎండనకా.. వాననకా.. రెక్కలు ముక్కలు చేసుకున్న రైతుకష్టం మొత్తం అకాలవర్షాల పాలవుతోంది. కలల పంట కొట్టుకుపోతుంటే కళ్లప్పగించి నిస్సహాయంగా నిలబడడం తప్ప ఏం చేయాలనే దైన్యం అన్నదాతలది. ఈ అకాల కష్టం, నష్టానికి ఎవరిది బాధ్యత? తక్షణం చేపట్టాల్సిన దిద్దుబాటు ఏమిటి? అకాలవర్షాల నుంచి అన్నదాతల్ని ఆదుకోవడం ఎలా? చినుకు పడితే రైతు కష్టం కొట్టుకుని పోవాల్సిందేనా? యార్డుల్లో ఎందుకు సౌకర్యాలు కల్పించలేక పోతున్నారు? యార్డుల్లో పంటను రోజుల తరబడి ఎందుకు ఉంచాలి? రైతుకు జరిగే నష్టం భర్తీపై ఎలాంటి విధానం ఉంటే మేలు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.