తెలంగాణ

telangana

PRATHIDWANI

ETV Bharat / videos

దేశంలో మీడియాను అణగదొక్కే ధోరణులకు విరుగుడు ఎలా? ఎప్పటికి?

By

Published : Apr 6, 2023, 10:42 PM IST

Updated : Apr 6, 2023, 10:51 PM IST

PRATHIDWANI: విమర్శిస్తే ప్రభుత్వ వ్యతిరేకత అనుకుంటే ఎలా? నిజాలు చెప్పడం పత్రికల విధి. కఠిన వాస్తవాలు ప్రజల ముందు ఉంచితేనే.. వారు సరైన ప్రత్యామ్నాయాలను ఎంపిక చేసుకుంటారు. అది కాదని మీడియా స్వేచ్ఛను నియంత్రిస్తే.. ప్రజలంతా ఒకేలా ఆలోచిస్తారు.. ఒకే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు. ఇది ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదం. ఒక మలయాళ వార్తా ఛానల్‌పై కేంద్ర ప్రభుత్వ విధించిన నిషేధం తొలగిస్తూ.. మీడియా స్వేచ్ఛను నియంత్రిస్తే.. ప్రజలంతా ఒకేలా ఆలోచిస్తారు. కఠినమైన విషయాలను వెల్లడిస్తేనే ప్రజలు సరైనా ప్రత్యామ్నాయాలను వెతుకుంటారు. నిజాలు చెప్పడం పత్రికల విధి అని..  దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు ఇవి.

ప్రజాస్వామ్య మనుగడకు స్వతంత్ర మీడియా చాలా ముఖ్యమైనది. మరి మీడియా స్వేచ్ఛపై ఆంక్షలు విధించడాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఇంత తీవ్ర స్థాయిలో ఎందుకు తప్పుపట్టింది? భావ ప్రకటన స్వేచ్ఛ, పత్రికా స్వాతంత్య్రం అన్న కోణంలో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు దేనికి సంకేతం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

Last Updated : Apr 6, 2023, 10:51 PM IST

ABOUT THE AUTHOR

...view details