Etela Rajender Latest Speech : కొన్ని పత్రికలు నా గురించి వ్యతిరేకంగా రాస్తున్నాయ్.. నేను పట్టించుకోను: ఈటల రాజేందర్ - etala speech about bc religion
Etela Rajender Latest Speech in Hyderabad: హైదరబాద్‌లోని ఓ గార్డెన్లో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో బీజీపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమితులైన సందర్భంగా బీసీ, ఎంబీసీ కుల సంఘాలతో ఈటల రాజేందర్‌కు ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రమంతట లక్షలాది కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి.. తినడానికి తిండి లేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. వరదల్లో కొట్టుకుపోయిన కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. బీసీలకు ఎల్లప్పుడూ అండగా ఉంటరని తెలిపారు. బహుజన వర్గాలకు శ్రమించే శక్తి ఉంటుంది కానీ ఆర్థిక శక్తి ఉండదని వెల్లడించారు. సదురు వర్గాలకి తానే నాయకుడని.. వారందరికి అండగా ఉంటారని హామీ ఇచ్చారు. కులాల పేర్లు మార్చమని వందలాది దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 35- 40 సంవత్సరాలు వచ్చినా.. ఉద్యోగాలు రాక తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవించే పరిస్థితి ఏర్పడిందని విచారం వ్యక్తం చేశారు. తన మీద కొన్ని పత్రికలు వ్యతిరేకంగా రాస్తున్నాయని.. తాను వాటికి భయపడలేదని స్ఫష్టం చేశారు. తాను మీడియాను నమ్మకుని నాయకుడుగా ఎదగలేదని.. ప్రజలను, కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తినని తెలిపారు.