Etela Rajender in Mudiraj Meeting : కొట్లాడాలే తప్ప జేజేలు కొడితే బతుకులు మారవు.. ముదిరాజ్ సభలో ఈటల - Etela Rajender
Published : Oct 8, 2023, 10:54 PM IST
Etela Rajender in Mudiraj Meeting :ఓట్లు మావే సీట్లు మావే అనే విధంగా కొట్లాడాలి తప్ప.. నేతలకు జేజేలు కొడితే బతుకులుమారవని బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన ముదిరాజ్‌ల ఆత్మ గౌరవ సభకు.. అయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముదిరాజ్‌లను BC- D నుంచి.. BC- Aకు మార్చడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు.
Etela Comments on BRS : సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశంపై ఎందుకు దృష్టి సారించట్లేదని నిలదీశారు. ముదిరాజ్‌లకు బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ముదిరాజులు 11 శాతం ఉన్నారని రాజకీయంగా ఆదరణ మాత్రం కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. ముదిరాజ్‌లకు కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని ఈటల డిమాండ్ చేశారు. మత్స్యకారుల కోసం రక్షణ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. జనాభా దమాసా ప్రకారంగా 11ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలన్నారు. బీసీలకు 9 మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉండగా కేవలం ముగ్గురికి మాత్రమే ఇవ్వడంపై అయన సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఓట్లు మావే సీట్లు మావే అనే నినాదాం ఇవ్వాలని ముదిరాజులకు పిలుపునిచ్చారు. పదేళ్లుగా ఆదివాసులకు మంత్రి పదవి ఇవ్వలేదని మండిపడ్డారు.