సీఎం కేసీఆర్ మాటలతో కోటలు కడతారు తప్ప - మన సమస్యలు తీర్చరు : ఈటల రాజేందర్ - బీఆర్ఎస్పై ఈటెల రాజేందర్ ఫైర్
Published : Nov 15, 2023, 4:01 PM IST
Etela Rajender Comments on KCR : నామినేషన్ల పర్వం ముగియడంతో.. ప్రధాన పార్టీలు తమ ప్రచారాలను మరింత ఉద్ధృతం చేశాయి. భారతీయ జనతా పార్టీ బీసీ నినాదంతో ముందుకు సాగుతూ.. పార్టీ అగ్రనేతలతో ప్రత్యేక సభలు ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ ప్రచార కమిటీ ఛైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కరీంనగర్ జిల్లాలో ప్రచారం చేస్తూ.. అధికార బీఆర్ఎస్పై నిప్పులు చెరిగారు. జిల్లాలోని వీణవంక మండలంలోని ప్రజలు.. ఈటలకు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఈటల.. సీఎం కేసీఆర్ మాటలతో కోటలు కడతారు తప్ప.. మన సమస్యలు తీర్చరని విమర్శించారు.
Etela Rajender Fires on BRS : రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి.. నేడు గంగపాలైందని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడి పదేళ్లు కావస్తోందని.. ఇప్పటివరకు ఎంత మంది యువతకు ఉద్యోగం కల్పించారని ప్రశ్నించారు. ఇచ్చే రెండు వేల ఫించన్ వల్ల బతుకులు బాగుపడవని.. మన పిల్లలకు ఉద్యోగాల కల్పన జరిగితే అదే పదివేలని అన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే బీజేపీ రావాలని నినదించారు.