అలుగుపోస్తున్న చెరువులు.. చేపలవేటలో గ్రామస్థులు - అలుగుపోస్తున్న చెరువులు
fish hunting: సూర్యాపేట జిల్లా మద్దిరాల, నూతన్‌కల్ మండలాల్లోని పెద్ద చెరువులు అలుగు పోస్తుండటంతో, చేపలు బయటికి వెళ్లకుండా పెట్టిన వల ఒకసారి తెగిపోయింది. దీంతో చెరువులోని చేపలు బయటికి దూకాయి. విషయం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా తండోపతండాలుగా వచ్చి చేపల వేటలో నిమగ్నమయ్యారు. ఒక్కొక్కరికి 10 నుంచి 15 కేజీల బరువున్న చేపలు దొరకడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరోవైపు చేపల కోసం కాంట్రాక్ట్ తీసుకున్నా గుత్తేదారు మాత్రం వలలు తెగిపోవడంతో సుమారు రూ.6 లక్షల నష్టం వచ్చిందని వాపోయాడు.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST