EPFO Employees Participate in Swachhata Hi Seva : ‘ఏక్ తారీఖ్ - ఏక్ ఘంటా’ కార్యక్రమంలో ఈపీఎఫ్ఓ అధికారులు
Published : Oct 2, 2023, 8:35 PM IST
EPFO Employees Participate in Swachhata Hi Seva :అక్టోబర్ 02న మహాత్మాగాంధీ జయంతి పురస్కరించుకుని ప్రధాని మోదీ పిలుపు మేరకు 'స్వచ్ఛతా హీ సేవా' కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రముఖ నాయకులు, ప్రభుత్వ అధికారులు ఈ స్వచ్ఛతా కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారు. హైదరాబాద్లోని బర్కత్‌పుర, మాదాపూర్ ఈపీఎఫ్ఓ అధికారులు ఆదివారం ‘ఏక్ తారీఖ్ - ఏక్ ఘంటా’ కార్యక్రమంలో భాగంగా సామూహిక పరిశుభ్రతా కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా సీసీ ష్రాఫ్ మెమోరియల్ హాస్పిటల్ ప్రాంగణాన్ని, కార్యాలయాల పరిసరాలను శుభ్రం చేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర అదనపు పీఎఫ్ కమిషనర్ వైశాలి దయాల్.. మాదాపూర్, బర్కత్‌పుర ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్లు సౌరభ్ జగతి, డాక్టర్ శివ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అధికారులందరూ తమ కార్యాలయాలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి కొంత సమయం కేటాయించుకోవాలని ఏసీసీ వైశాలి దయాల్ కోరారు. పీఎఫ్ కార్యాలయం ఆవరణలో సౌరభ్ జగతి చెట్లను నాటారు. ఇంకా, స్వచ్ఛతా ప్రచారంపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం అధికారులు, సిబ్బంది మానవ గొలుసును ఏర్పాటు చేశారు.