టీఎన్జీవో కార్యాలయంలో ఉద్యోగుల గొడవ - రాజకీయ కుట్రతో కమిటీ ఏర్పాటు చేశారంటూ కొట్లాట - ఖమ్మంలో టీఎన్జీఓ ఉద్యోగుల పంచాయితీ
Published : Dec 4, 2023, 5:22 PM IST
|Updated : Dec 4, 2023, 5:31 PM IST
Employees fight at Khammam TNGO : ఖమ్మం టీఎన్జీవో జిల్లా కార్యాలయం రణరంగాన్ని తలపించింది. ఉద్యోగులు రెండు వర్గాలుగా ఏర్పడి బాహాబాహీకి దిగారు. ఇప్పటి వరకు ఉన్న హడ్‌హక్ కమిటీ కార్యాలయం ఖాళీ చేయాలని గొడవకు దిగారు. ఎన్నికైన జనరల్ బాడీ కమిటీ సభ్యులు డిమాండ్ చేస్తూ ప్రెస్‌మీట్ పెట్టేందుకు కార్యాలయానికి వచ్చారు. గత ప్రభుత్వంలో ఎన్నికైనా కమిటీ అధ్యక్ష, కార్యదర్శులను వేరే జిల్లాలకు బదిలీ చేశారని ఆరోపించారు. ఇప్పుడున్న హడ్‌హక్ కమిటీ రాజకీయ కుట్రల ద్వారా ఏర్పడిందని ఆరోపించారు.
ఎన్నికలు నిర్వహించి కమిటీ ఏర్పాటు చేసుకుంటే తమకు ఏమీ అభ్యంతరం లేదని ప్రస్తుత కమిటీ నాయకులు తెలిపారు. ఎన్నికలు నిర్వహించి కొత్త కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను బయటకు పంపి కార్యాలయానికి తాళాలు వేశారు. త్వరలో కేంద్ర కమిటీ వచ్చి నూతన కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు టీజీవో నాయకులు తెలిపారు.