Prathidwani : 'సీపీఎస్ వద్దు.. పాత పెన్షనే ముద్దు' అంటున్న ఉద్యోగులు.. అసలు కొత్త.. పాత పెన్షన్ విధానాల మధ్య వ్యత్యాసం ఏంటి? - discussion on cps
Employee CPS Issue in Telangana: పాత పెన్షన్ విధానం అమలు చేయాలి! తక్షణం సీపీఎస్‌ను రద్దు చేయాలి! ఇదే నినాదంతో మరోసారి రాష్ట్రంలో టీఎస్‌సీపీఎస్‌ఈయూ నేతృత్వంలో ఉద్యమ బాట పట్టారు.. సీపీఎస్ ఉద్యోగులు! ఇందుకోసం ఈ నెల 16 నుంచే ఆందోళనలు ప్రారంభించింది.. తెలంగాణ స్టేట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ సీమ్ ఎంప్లాయీస్ యూనియన్. ఈ ఆందోళనలు ఈ నెల 31 వరకు కొనసాగనున్నాయి. దీనికి పలు ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ యాత్రలో ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఆగస్టు 12న చలో హైదరాబాద్ నిర్వహించబోతున్నట్లు కూడా ప్రకటించారు. మరి.. వారంతా పాత పెన్షన్ విధానమే అమలు చేయాలని ఎందుకు ఉద్యమం చేస్తున్నారు? కొత్త.. పాత పెన్షన్ విధానాల మధ్య వ్యత్యాసం ఏమిటి? సీపీఎస్ వల్ల సగటు ఉద్యోగికి ఉన్న ఇబ్బందులు ఏమిటి? ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నుంచి వారు కోరుకుంటున్న హామీలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.