తెలంగాణ

telangana

రైలు పట్టాలపై ఏనుగు

ETV Bharat / videos

పట్టాలపై ఏనుగు.. దూసుకొస్తున్న రైలు! అంతా టెన్షన్.. టెన్షన్.. చివరకు - ఏనుగు వీడియోలు

By

Published : Mar 1, 2023, 8:41 PM IST

తమిళనాడు కోయంబత్తూరులో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓ ఏనుగును కాపాడేందుకు.. అటవీ శాఖ అధికారులు తీవ్రంగా శ్రమించారు. పట్టాలపై నిలుచున్న ఆ ఏనుగు ప్రాణాలు రక్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో రైలు మరింత ముందుకు రావడం వల్ల తీవ్ర ఆందోళలనకు గురయ్యారు. ఎక్కడ ఏనుగును రైలు ఢీకొంటుందోనన్న భయంతో వణికిపోయారు. లోకోపైలట్​ సైతం భయపడి.. పదే పదే రైలు హారన్ శబ్దం చేశాడు. దాన్ని పట్టాలపై నుంచి పక్కకు పంపించే ప్రయత్నం చేశాడు. ఇటుపక్క అటవీ శాఖ సిబ్బంది ​సైతం టపాసుల శబ్దంతో ఏనుగును కాపాడే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు పట్టాల నుంచి ఏనుగు కిందకి దిగడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మదుక్కరై సమీప ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

ABOUT THE AUTHOR

...view details