తెలంగాణ

telangana

కర్ణాటకలోని కిరాణా షాపులో ఏనుగు దొంగతనం

ETV Bharat / videos

కిరాణా షాపులో ఏనుగు 'దొంగతనం'!.. షట్టర్‌ ధ్వంసం చేసి అరటిపళ్లు, కూరగాయలు తిన్న గజరాజు - ఏనుగు దాడి వీడియో కర్ణాటక

By

Published : Aug 4, 2023, 1:24 PM IST

Elephant Attack Video : కర్ణాటకలోని ఓ కిరాణా షాప్​లో అడవి ఏనుగు 'దొంగతనం' చేసింది. దుకాణం​ షట్టర్‌ను పూర్తిగా ధ్వంసం చేసి.. అందులోని అరటిపళ్లు, కూరగాయలను ఆరగించింది. చామరాజనగర్‌లోని పుణేజనూరు-అసనూర్ జాతీయ రహదారి పక్కనున్న షాప్​పై ఏనుగు ఇలా దాడి చేసింది. ఈ దుకాణం వెంకటేశ్‌ అనే వ్యక్తికి చెందిందని తెలిసింది. ఏనుగు దాడిపై సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. అక్కడి నుంచి గజరాజును తరిమేశారు. ఏనుగు షాప్​లో ఉన్న సామగ్రిని కూడా నాశనం చేసిందని స్థానికులు తెలిపారు. కాగా ఏనుగు దాడిలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.  

యువకులకు చుక్కలు చూపించిన ఏనుగు.. సెల్ఫీ కోసం వెళ్తే ఛేజ్ చేసి..
నెల రోజుల క్రితం ఉత్తర్​ప్రదేశ్​లోని రిజర్వ్ ఫారెస్ట్​లో ఏనుగులు హల్​చల్ చేశాయి. సెల్ఫీ కోసం దగ్గరకు వచ్చిన ముగ్గురు వ్యక్తుల వెంట పడ్డాయి. దీంతో వాటి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు.. పరుగు ప్రారంభించారు ఆ ముగ్గురు. లఖీంపుర్​ ఖేరీ జిల్లాలోని దుధ్వా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్​ ఏరియాలో ఈ ఘటన జరిగింది. వీడియో కోసం ఇక్కడ క్లిక్​ చేయండి. 

ABOUT THE AUTHOR

...view details