తెలంగాణ

telangana

వ్యర్థాలతో ఈ బైక్‌ తయారు చేసిన కోల్​కతా విద్యార్థి

ETV Bharat / videos

Electric Bike From Scrap : వ్యర్థాలతో ఈ-బైక్‌ తయారు చేసిన డిగ్రీ విద్యార్థి.. కొత్తది కొనే స్థోమత లేక.. - వైరల్ వీడియోలు

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2023, 12:19 PM IST

Updated : Sep 8, 2023, 2:40 PM IST

Electric Bike From Scrap :వ్యర్థాల నుంచి ఎలక్ట్రిక్ బైక్​ను​ తయారు చేశాడు బంగాల్​కు చెందిన ఓ యువకుడు. చిన్న వయసులోనే ఎకోఫ్రెండ్లీ బైక్​ రూపొందించి అందరి మన్ననలు పొందుతున్నాడు. ఇటీవలే ఇంటర్​ పూర్తి చేసిన సుభ్రజ్యోతి రాయ్​ అనే విద్యార్థి.. ఈ వినూత్న ఎలక్ట్రిక్ బైక్​కు రూపకల్పన చేశాడు.

కోల్​కతాలోని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన సుభ్రజ్యోతి రాయ్​కు.. తల్లిదండ్రులకు ఓ బైక్ కొనివ్వాలనే కోరిక ఉండేది. కానీ కొత్త బైక్ కొనే స్థోమత ఆ కుటుంబానికి లేదు. దీంతో తానే ఓ బైక్​ను తయారు చేసి తల్లిదండ్రులకు కానుకగా ఇవ్వాలనుకున్నాడు. అనంతరం అందుకు తగ్గ ప్రణాళికను రూపొందించుకున్నాడు.

స్థానిక ఆటోమొబైల్ మార్కెట్​ నుంచి వివిధ పరికరాలు కొనుగోలు చేసి ఎలక్ట్రిక్ ఎకోఫ్రెండ్లీ బైక్​ను తయారుచేశాడు. ఈ బైక్​ నుంచి కొంచెం కూడా సౌండ్ రాదని తెలిపాడు సుభ్రజ్యోతి. కేవలం 40 నిమిషాల్లో ఇది పుల్​ ఛార్జింగ్ అవుతుందని వెల్లడించాడు. ఇందులో పెట్రోల్​ పోసే అవసరం లేదని సుభ్రజ్యోతి పేర్కొన్నాడు. ఈ బైక్​లో ప్రత్యేక పరికరాలు అమర్చినట్లు తెలిపిన అతడు.. ఎవరైనా ఈ బైక్​ను చోరీ చేసిన వెంటనే తెలిసిపోతుందని వివరించాడు.

Last Updated : Sep 8, 2023, 2:40 PM IST

ABOUT THE AUTHOR

...view details