Prathidwani: ఎన్నికలు కర్ణాటకలో.. వేడి తెలంగాణలో..! - latest prathidwani video
Elections in Karnataka: ఎన్నికలు కర్ణాటకలో.. వేడి తెలంగాణలో. హోరాహోరీగా సాగుతున్న కర్ణాటక ఎన్నికల వేళ అందర్నీ ఆకర్షిస్తోన్న పరిణామం ఇదే. ఎందుకంటే కర్ణాటక ఎన్నికలు అయిపోయిన అనంతరం రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం కర్ణాటకలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతుంది. బీజేపీ, కాంగ్రెస్ అగ్ర నాయకులు అందరూ ప్రచారంలో తమ వంతు కృషి చేస్తున్నారు. తెలంగాణలో ఉన్న ప్రముఖ నాయకులు పాల్గొంటున్నారు. కర్ణాటక ఎన్నికలు ముగిసిన తరవాత ఆ నాయకుల ప్రచారం తెలంగాణలో జరగునుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వీటన్నింటికి బీఆర్ఎస్ సరైనా సమాధానం చెప్పనుందా? ఆ ప్రభావాన్ని తట్టుకుని ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రాడానికి ఎలాంటి వ్యూహాలు వేయనుంది? పక్క రాష్ట్రంలో ఎన్నికలు ఇక్కడ కాక రేపుతూ ఉండడానికి కారణం ఏమిటి? అసలు... తెలంగాణపై కర్ణాటక ఫలితాల ప్రభావం ఎంత? కన్నడ నాట ఢీ అంటే ఢీ అంటున్న బీజేపీ - కాంగ్రెస్‌ల తర్వాతి లక్ష్యం తెలంగాణయే అన్నట్లుగా కనిపిస్తున్న పరిణామాలను బీఆర్ఎస్ ఎలా ఎదుర్కోనుంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.