బీజేపీలో నయా జోష్- డ్యాన్సులతో హోరెత్తిస్తున్న లేడీస్- ఈమె నృత్యం హైలైట్! - ధూమ్‌ధామ్‌గా కమలం కార్యకర్తల సంబరాలు
Published : Dec 3, 2023, 1:26 PM IST
Election Results Today BJP Celebrations : 2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ దూసుకుపోతుండడం వల్ల ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఆయా రాష్ట్రాల్లో కమలం పార్టీ కార్యకర్తలు డ్యాన్సులు చేస్తున్నారు.
దిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి అనుకూలంగా నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. డప్పులకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
డ్యాన్సులతో హోరెత్తిస్తున్న మహిళలు
BJP Celebrations In Rajasthan : రాజస్థాన్‌లోని జైపుర్‌లో ఉన్న బీజేపీ ప్రధాన కార్యాలయం వెలుపల ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. డప్పు వాయిద్యాల మధ్య మహిళలు ఎంతో ఉత్సాహంతో డ్యాన్సులు చేస్తున్నారు. మిఠాయిలు పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోనూ సంబరాలు
BJP Celebrations In Madhya Pradesh : మరోవైపు, మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్‌ను తారుమారు చేస్తూ బీజేపీ ముందంజలో దూసుకువెళ్తోంది. దీంతో పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మిఠాయిలు పంచుకుంటూ ఉత్సాహంగా నృత్యాలు చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోనూ కమలం పార్టీ నేతలు విజయం తమదేనని ఉత్సాహంగా డ్యాన్సులు వేస్తున్నారు.