తెలంగాణ

telangana

Elderly woman forced to walk

ETV Bharat / videos

పెన్షన్​ కోసం వృద్ధురాలి అవస్థలు.. విరిగిన కుర్చీ సాయంతో ఎండలో కి.మీల నడక - పెన్షన్ కోసం వృద్ధురాలి కష్టాలు

By

Published : Apr 20, 2023, 6:11 PM IST

Updated : Apr 20, 2023, 7:05 PM IST

ఒడిశా నబరంగపుర్​లో పింఛను కోసం ఓ వృద్ధురాలు పడుతున్న అవస్థలు.. అందరినీ చలింపచేశాయి. సూర్య హరిజన్ అనే 70 ఏళ్ల వృద్ధురాలు పింఛన్​ కోసం మండే ఎండలో విరిగిన కుర్చీ సాయంతో అనేక కిలోమీటర్లు ప్రయాణించింది. ఆమె కాళ్లకు కనీసం చెప్పులు కూడా లేవు. విరిగిన కుర్చీని ఆసరాగా చేసుకుని ఆ వృద్ధురాలు చాలా దూరం ప్రయాణించి వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఆమె చేతి వేలిముద్రలు సరిగా పడట్లేదు. అందుకే బ్యాంక్ అధికారులు ఆమెకు పెన్షల్ ఇవ్వలేదు.  

అస్థిపంజరంలా ఉన్న వృద్ధురాలు మండుటెండలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లడం పలువురిని కంటతడి పెట్టిస్తోంది. బానుగూడ పంచాయతీకి చెందిన సూర్య హరిజన్​ పెద్ద కొడుకు సీతారం పొట్టకూటి కోసం వేరే రాష్ట్రానికి వలస వెళ్లాడు. చిన్న కుమారుడు మాషురామ్ గ్రామంలో ఆవుల మేపుతున్నాడు. అతడు సరైన ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధురాలిని ప్రభుత్వం సత్వరమే ఆదుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 

Last Updated : Apr 20, 2023, 7:05 PM IST

ABOUT THE AUTHOR

...view details