పెళ్లిలో డాన్స్.. మధ్యలోనే గుండెపోటు.. కుప్పకూలిన వృద్ధుడు - డాన్స్ చేస్తూ వ్యక్తి మృతి
alirajpur dance death: గిరిజన వివాహ వేడుకలో సంప్రదాయ నృత్యం చేస్తూ ఓ వృద్ధుడు కుప్పకూలిపోయాడు. గుండెపోటు వచ్చి అతడు ప్రాణాలు కోల్పోయాడు. మధ్యప్రదేశ్ అలీరాజ్పుర్లోని ఒజార్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. అందరూ కలిసి కర్రలతో దాండియా వంటి నృత్యం చేశారు. ఈ క్రమంలోనే 60 ఏళ్ల ముర్సా దావర్.. కుప్పకూలాడు. చుట్టుపక్కల ఉన్నవారు అతడిని పైకి లేపి.. ముఖంపై నీళ్లు చల్లారు. అయినప్పటికీ అతడు స్పృహలోకి రాలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతడు మరణించాడని వైద్యులు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST