తెలంగాణ

telangana

Young Man Died

ETV Bharat / videos

Young Man Died In Swimming Pool : మద్యం మత్తులో ఈతకు వెళ్లి యువకుడు మృతి - తెలంగాణ క్రైమ్​ వార్తలు

By

Published : Jun 8, 2023, 7:32 PM IST

Drunken Young Man Died In Swimming Pool : ఎప్పుడు ఎవరికి ఏమౌతుందో తెలియదు.  మనం ఏ స్థితిలో ఉన్నామని తెలుసుకోకుండా జల్సాల కోసం వెళితే ప్రాణాలు కోల్పోతాము. ప్రసుత రోజుల్లో చాలా మంది అధిక స్పీడుతో, మద్యం సేవించి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. చల్లదనం కోసం రాని ఈతలకు వెళ్లి నీటిపై శవాల్లా తేలుతున్నారు. ఇలాంటి ఘటనే సికింద్రాబాద్​లో జరిగింది. మద్యం మత్తులో ఈతకు వెళ్లిన కుర్రాడు స్విమ్మింగ్​పూల్​లో దిగి చనిపోయాడు.

ఫతేనగర్​కు చెందిన సంపత్ అనే యువకుడు ఈత కొట్టేందుకు స్విమ్మింగ్ పూల్​కు వచ్చి అందులో మునిగి చనిపోయాడు. తన స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు స్విమ్మింగ్ పూల్​కు వచ్చిన సంపత్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మద్యం మత్తులోనే అతను మునిగిపోయి చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అతనితో ఉన్న స్నేహితులు కూడా మద్యం మత్తులోనే ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సంపత్​తో ఉన్న స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సీసీ కెమెరాలు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details