నేను బీజేపీ నాయకుడిని, నాపైనే చేయి వేస్తావా - మద్యం మత్తులో వ్యక్తి హల్చల్ - Druken men viral video
Published : Jan 12, 2024, 5:18 PM IST
Drunken Men argues with Traffic Police :విధి నిర్వహణలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వహిస్తుండగా బీజేపీ పార్టీ నాయకుడినంటూ ఓ వ్యక్తి మద్యం మత్తులో హల్ చల్ చేశాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం మాల్కాపూర్కు చెందిన నాగరాజు, నారాయణ అనే ఇద్దరు వ్యక్తులు ఫుల్లుగా మద్యం సేవించి వాహనం నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో తనిఖీలు చేస్తున్న పోలీసులు వీరిని గమనించి వారి వాహనాన్ని ఆపారు.
వీరికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించగా, మందు బాబులు ట్రాఫిక్ పోలీసులపై తిరగబడ్డారు. ఈ క్రమంలో మద్యం మత్తులో తాను బీజేపీ నాయకుడిని అంటూ ట్రాఫిక్ ఎస్సై ఉదయ్ కిరణ్‌ను నెట్టివేశాడు. అంతేకాకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగి దురసుగా ప్రవర్తించాడు. దీంతో వెంటనే ట్రాఫిక్ పోలీసులు స్థానిక ఎన్టీపీసీ ఠాణాకు సమాచారమిచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మందు బాబులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ట్రాఫిక్ ఎస్సై ఉదయ్‌కిరణ్ ఫిర్యాదు మేరకు మందు బాబులపై కేసు నమోదు చేశారు.