మత్తులో గూడ్స్ ట్రైన్ పైకెక్కి.. 220 కి.మీ. ప్రయాణం.. పక్క రాష్ట్రానికి వెళ్లాక.. - Traveling on Train Roof
Traveling on Goods Train Roof: ఓ యువకుడు బిహార్‌లో గూడ్స్ రైలు పైకి ఎక్కి 220 కిలోమీటర్లు ప్రయాణించాడు. మద్యం మత్తులో ఉన్న అతడు.. గయాలోని మాన్పుర్ నుంచి ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు రైలు బోగీ పైన ప్రయాణించి చేరుకున్నాడు. ధన్‌బాద్ స్టేషన్లో అతడిని గమనించిన ప్రయాణికులు, సిబ్బంది.. కిందకు దించారు. యువకుడిని తునకుప్ప ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. హైటెన్షన్ విద్యుత్ తీగల ప్రమాదం ఉన్నప్పటికీ యువకుడు క్షేమంగానే బయటపడ్డాడు. దిగేటప్పుడు విద్యుత్ తీగలకు తగిలితే పెద్ద ప్రమాదం జరిగేదని స్టేషన్లో ఉన్న ఆందోళన చెందారు. ఇటీవలే బిహార్‌లో ఓ వ్యక్తి ఇంజిన్ కింద కూర్చొని 190 కి.మీ. ప్రయాణించాడు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST