తెలంగాణ

telangana

DRF team

ETV Bharat / videos

DRF team rescued pregnant women : సమయానికి స్పందించిన డీఆర్​ఎఫ్​.. గర్భిణీలిద్దరూ సేఫ్​ - ములుగు జిల్లాలో గర్భీణులను రక్షించిన డీఆర్​ఎఫ్

By

Published : Jul 19, 2023, 5:41 PM IST

DRF team rescue operation in Mulugu : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరద ఉద్ధృతి పెరిగి వాగు దాటలేని అత్యవసర పరిస్థితిలో ఉన్న.. ఇద్దరు గర్భిణీలను వాగు దాటించి డీఆర్​ఎఫ్​ సిబ్బంది ఉదారస్వభావాన్ని చాటుకున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి గ్రామ సమీపంలో జంపన్న వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామంలోని ఇద్దరు గర్భిణీలు డబ్బాకట్ల సునీత, చేరుకల శ్రీమతి ఆసుపత్రికి వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. సమాచారం తెలియడంతో జిల్లా ఎస్పీ గౌస్ ఆలం ఆదేశాల మేరకు.. డిజాస్టర్ అండ్ రెస్క్యూ ఫోర్స్ బృందం అత్యవసర సహాయక చర్యలను చేపట్టారు. రబ్బర్ బోట్ సహాయంతో ఇద్దరు గర్భిణీలను రక్షించి.. ఏటూరు నాగారం ప్రభుత్వాసుపత్రికి సురక్షితంగా తరలించారు. ఏటూరు నాగారం ఏఎస్పీ సిరిశెట్టి సంకీర్త ఈ సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ఆపరేషన్​లో పాల్గొన్న పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. అత్యవసర సమయంలో గర్భిణీ స్త్రీలకు సహాయం చేసిన పోలీసుశాఖను పలువురు అభినందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details