చర్లపల్లిలో డ్రైనేజీ పైప్‌లైన్ బ్లాస్ట్ - భయంతో పరుగులు తీసిన స్థానికులు - Explosion In Hyderabad
Published : Jan 3, 2024, 10:45 AM IST
Drainage Pipeline blast In Cherlapalli : హైదరాబాద్ చర్లపల్లిలో భారీ పేలుడు సంభవించింది. చర్లపల్లి డివిజన్ వెంకట్ రెడ్డి నగర్లో ఉండే డ్రైనేజీలో కెమికల్ కలపడం వల్ల పైప్ లైన్ తీవ్ర శబ్దంతో బ్లాస్ట్ అయ్యింది. భారీ శబ్దంతో మ్యాన్ హోల్ మూత ఎగిరి పడటంతో ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కి పడ్డారు. భయంతో అక్కడి నుంచి కాలనీ వాసులు పరుగులు తీశారు. పేలింది మ్యాన్‌హోల్ పైప్‌లైన్ అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.
Pipe Line Exploded Due To Chemical Mixing In Drainage :ఘటనపై సమాచారం అందుకున్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో పాటు, పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అండర్ డ్రైనేజీలో కెమికల్ పైప్ లైన్ వేసి వ్యర్థాలు విడుదల చేసిన కంపెనీ యాజమాన్యం మీద చర్యలు తీసుకుంటామని కాలనీ ప్రజలకు పోలీసులు హామీ ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇళ్ల మధ్యలో ఇలా ఫ్యాక్టరీలు ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు తమ గోడును అధికారులుక వెల్లబోసుకున్నారు.