కుక్కను దొంగతనం చేసిన బీటెక్ స్టూడెంట్స్.. హెల్మెట్‌లో పెట్టి సైలెంట్‌గా.. - పెట్ షాపులో కుక్క దొంగతనం
పెట్ షాపులోని కుక్కపిల్లను చాకచక్యంగా దొంగిలించారు ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు. ఈ శునకాన్ని హెల్మెట్‌లో పెట్టి ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటన జనవరి 28న కేరళలోని కొచ్చిలో జరిగింది. బోనులో ఉన్న కుక్కపిల్ల కనిపించకపోవడం వల్ల దుకాణదారుడు షాపులోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాడు. అప్పుడు అసలు విషయం బయటపడింది. వెంటనే దుకాణదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కర్ణాటకకు చెందిన 23 ఏళ్ల నిఖిల్, 23 ఏళ్ల శ్రేయను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి కుక్కపిల్లను స్వాధీనం చేసుకుని యజమానికి అప్పగించారు. అపహరణకు గురైన కుక్కపిల్ల స్విఫ్ట్ జాతికి చెందినదని పెట్ షాపు యజమాని తెలిపాడు. దాని ధర రూ.20 వేలు ఉంటుందని చెప్పాడు.