శునకానికి కన్నీటి వీడ్కోలు.. కారులో ఊరేగింపు.. వర్షంలోనూ అంతిమయాత్ర - dog funeral odisha
ఒడిశాలో ఓ శునకానికి ఘనంగా అంత్యక్రియలు జరిపించింది ఓ కుటుంబం. 17ఏళ్లుగా ఎంతో విశ్వాసంతో తమతో కలిసి ఉన్న శునకానికి కారులో ఊరేగిస్తూ అంతిమయాత్ర నిర్వహించింది. గజపతి జిల్లాలోని పార్లాఖేముందీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తున్ను గౌడ కుటుంబం 17 ఏళ్లుగా ఈ శునకాన్ని పెంచుకుంటోంది. అంజలి అని పేరుపెట్టి అల్లారుముద్దుగా చూసుకుంటూ ఉండేది. ఈ క్రమంలోనే శునకం ప్రాణాలు కోల్పోగా.. దానికి అశ్రునయనాలతో వీడ్కోలు పలికింది. పూలమాలలతో కారును అలంకరించి శునకం మృతదేహాన్ని అందులో ఊరేగించింది. వర్షంలోనూ అంతిమ యాత్ర నిరాటంకంగా కొనసాగింది. అంత్యక్రియలకు బ్యాండుమేళాన్ని సైతం ఏర్పాటు చేశారు. శునకం యజమాని తున్న గౌడ.. సోమవారం దానికి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST